May 29,2023 19:29

'విరాట పర్వం', 'గార్గి' చిత్రాల తర్వాత సాయి పల్లవి తెరపై కనిపించి చాలా రోజులవుతోంది. సెలెక్టివ్‌గా, నచ్చిన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రత్యేకతని చూపించే సాయి పల్లవి ఏడాది కాలంగా తెరపై కనిపించకపోవడానికి గల అసలు కారణం తాజాగా బయటపెట్టారు. తనకి గ్యాప్‌ రాలేదని.. తానే సినిమాల నుండి గ్యాప్‌ తీసుకున్నానని చెప్పారు. కొద్దిరోజులు సినిమా షూటింగ్స్‌ నుండి బ్రేక్‌ తీసుకుందామనుకునే ఏ సినిమా ఒప్పుకోలేదని చెప్పారు. ప్రస్తుతం సాయి పల్లవి తమిళనాట కమల్‌ హాసన్‌ నిర్మాణంలో తెరకెక్కబోయే శివ కార్తికేయన్‌ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.