Nov 03,2020 18:35

మధుబని: బీహార్‌లో జరుగుతున్న ఎన్నికలు శనివారంతో పూర్తికానున్నాయి. మూడో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా జెడియు నేత, సిఎం నితీష్‌కుమార్‌ మధుబనిలో సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతుండగా హఠాత్తుగా ఉల్లిగడ్డలు ఆయన మీదకు వచ్చి పడ్డాయి. మీటింగ్‌కు హాజరైన ఒక వ్యక్తి ... నిరసన తెలపడంలో భాగంగా నితీష్‌కుమార్‌పైకి ఉల్లిగడ్డలు విసిరారు. అయితే అవి నితీష్‌కుమార్‌కు తగలలేదు. ఈలోపు సెక్యూరిటీ గార్డులు ఆయనకు రక్షణగా నిలబడ్దారు. ఉల్లిగడ్డలు విసిరేసిన వ్యక్తిని గుర్తించగా అతన్ని వదలిపెట్టండంటూ నితీష్‌కుమార్‌ చెప్పారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత తేజస్వియాదవ్‌, లలూ ప్రసాద్‌పైన నితీష్‌ విమర్శలు గుప్పించారు.