
ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె మండలం సోడాయపాలెం గ్రామానికి చెందిన మండే రత్నబాబు అనే వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోవ డంతో వారికి చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ రూ.3.50 లక్షల చెక్కు మంజూరు కావడంతో వారి కుటుంబ సభ్యులకు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ మాట్లాడుతూ మంజూరయిన సీఎం రిలీఫ్ ఫండ్‌ను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండటమే సీఎం జగన్ ధ్యేయమన్నారు. నిరుపేదలకు ఆర్థిక భారం కాకుండా వైద్యానికి అయ్యే ఖర్చులను సీఎం జగన్ అందిస్తున్నారన్నారు. మంజూరుకు కృషి చేసిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావుకి కృతజ్ఞతలు తెలిపారు. చెక్కులు తీసుకున్న లబ్ధిదారుడు మోపిదేవి వెంకటరమణారావుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి రూరల్ కన్వీనర్ గాదె వెంకయ్య బాబు తదితరులు పాల్గొన్నారు.