Nov 25,2021 15:51

పాణ్యం:పాణ్యం మండల కేంద్రంలో సి.ఎం కప్‌ పోటీలను ఎంపిపి హుస్సేన్‌ బీ గురువారం ప్రారంభించారు. పాణ్యం గ్రామంలో జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత క్రీడలలో రాణించాలని ఆమె పిలుపునిచ్చారు. ఎస్సై సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ యువత సరైన దారిలో వెళ్ళినపుడు దేశం శాంతి యుతంగా ఉంటుందని చెప్పారు.ఎం.పి.డి.ఓ. మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమం అమలు చేయడంవల్లే డ్రాప్‌ అవుట్‌ ల సంఖ్య తగ్గిందని, ప్రభుత్వ సదుపాయాలు వినియోగించుకుంటూ విద్యార్థులు ఉన్నతిలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై.సి.పి.నాయకులు కరుణాకర్‌ రెడ్డి, జాకీర్‌ , ప్రిన్సిపల్‌ రామన్‌, జిలాని బాషా, సర్పంచ్‌ పల్లవి పాల్గొన్నారు.