Jul 18,2021 12:28

కుటిలత్వం వికటాట్టహాసంగా నవ్వితే...
నమ్మకాలను వివస్త్రగా మార్చితే..
నడిబజార్లో మగువ నవ్వులు పాలైతే..
సభ్యసమాజం సిగ్గుతో తలవంచదా... ?
నేటి యువత పోకడలు చూసి..

నమ్మకాలను వమ్ము చేసేస్తాడు ఒకడు..
స్నేహం ముసుగులో దాడిస్తాడు ఒకడు..
నయవంచనతో మోసం చేస్తాడు ఒకడు..
వికృత చేష్టలతో.. నిర్బాగ్యులను
సమిధలుగా మారుస్తాడు ఒకడు..

క్రూరమృగాలను తలదన్నేలా.. పాశవికంగా
ఎందరి మాన ప్రాణాలనో బలిగొంటాడు ఒకడు..
మాతృమూర్తుల హృదయ రోదనలు
వినిపించని పబ్బుల్లోనూ, పార్టీల్లోనూ జల్సాగా
కాలం గడుపుతాడు ఒకడు..

దేశం తనకేదో చేయలేదని ఆవేశంతో నిందిస్తూ
మత్తులో జోగుతున్న ఓ యువతా!
కంటికి కనిపించే చర్యలను ఖండించలేవా..?
మీ వికృత చేష్టలకు ప్రతి మాతృ హృదయం
సిగ్గు పడవలసినదేనా?.ఇకనైనా మత్తు నుండి మేలుకో

రాము కోలా
98490 01201