
చిలమత్తూరు (అనంతపురం) : చిలమత్తూరు మండలం సీనియర్ పాత్రికేయులు డికె.శ్రీధర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. డికె.శ్రీధర్ మొదట సూర్య పత్రికలో, ప్రజాశక్తి పత్రికలో, ఆ తర్వాత సాక్షి పత్రికలో పాత్రికేయులుగా పనిచేశారు. గత 2 నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. డికె.శ్రీధర్ మరణవార్త విన్న పలువురు పాత్రికేయ మిత్రులు సంతాపం తెలిపారు.