
సీతాకోక చిలుకలపై అవగాహన కల్పిస్తున్న నమిత
ప్రజాశక్తి - ఆరిలోవ : ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాల ఆధ్వర్యాన శనివారం విద్యార్థులకు సీతాకోక చిలుకలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని సీతమ్మధారలోని కీస్సోన్ పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జూ పార్కులోని బటర్ ఫ్లై పార్కులో గల సీతాకోక చిలుకల రకాలు, వాటి జీవన విధానం గురించి పార్కు అసిస్టెంట్ నమిత విద్యార్థులకు వివరించారు. ప్రపంచంలో ఉండే రకాల సీతాకోక చిలుకలు, వాటి ఆహారపు అలవాట్లు వంటి ఆసక్తికర విషయాలను తెలియజేసారు. సీతాకోకచిలుకల జీవితంలోని వివిధ దశల గురించి వివరించారు.