
ప్రజాశక్తి-వేటపాలెం: సిలోన్ కాలనీ ఇళ్లకు హక్కు పత్రాలు ఇవ్వడానికి తగిన ఆధాలను సేకరించాలని ఆర్డిఓ సరోజని సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆమె మండల పరిధిలోని దేశాయి పేట పంచాయతీ, నీలకంఠపురంలోని సిలోన్ కాలనీ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆప్రాంత ప్రజలు మాట్లాడుతూ 1980లో నూలుమిల్లులో పనిచేందుకు శ్రీలంక నుంచి ప్రభుత్వపరంగా ఇక్కడకు తీసుకొచ్చారన్నారు. అప్పటి నూలుమిల్లు యాజమాశ్ర్యీం సుమారు 142 ఇళ్లకు పది ఏకరాలు లేఅవుట్ వేసి ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు. కాలక్రమేణా మిల్లు మూతపడినాక తమను కొంతకాలం ప్రభుత్వం ఆదుకొందన్నారు. సర్వహక్కులు 56 మందికి ఇచ్చి సుమారు 68 మందికి అసలు ఎలాంటి హక్కు పత్రాలు ఇవ్వకపోవడంపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ కె సంధ్యశ్రీ, విఆర్ఓలు ఫక్రుద్దీన్, శివారెడ్డి, హౌసింగ్ వర్క్ఇన్స్పెక్టర్ ఉషయ్య పాల్గొన్నారు.