Jan 19,2022 08:11

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : సిరగరేణి బొగ్గు సంస్థకు సంబంధించిన ఆస్తులపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదానికి ఇప్పట్లో తెర పడేలా లేదు. సింగరేణి ఆస్తులపై తమకూ హక్కు ఉందని ఆరధ్రప్రదేశ్‌ వాదిస్తుండగా, భౌగోళిక ప్రాతిపదికన తమకే సింగరేణిపై పూర్తి హక్కులుంటాయని తెలంగాణ చెబుతోంది. అయితే సింగరేణి కార్యకలాపాలు పూర్తిగా తెలంగాణలోనే ఉన్నందున ఈ సంస్థ ఇరు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి సంస్థ కాబోదని కేంద్ర అటార్నీ జనరల్‌ ఇదివరకే ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనతో ఏకీభవిస్తున్నట్లు కేంద్రం పేర్కొంటూనే, మళ్లీ ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. 12వ షెడ్యూల్‌లోని సిరగరేణి సంస్థకు కావాల్సిన బొగ్గులో 51 శాతం ఉమ్మడి ఆరధ్రప్రదేశ్‌లోనిదని, మిగిలిన 49 శాతం కేంద్ర ప్రభుత్వానిదని ఆంధ్రప్రదేశ్‌ చెబుతోంది. అయితే ఈ సంస్థ 9వ షెడ్యూల్‌లోకి వస్తుందా లేదా 12వ షెడ్యూలులోకి వస్తుందా అన్నది తేల్చాలని 2018లోనే నిపుణుల కమిటీ కేంద్రాన్ని కోరింది. ఆ కమిటీ గడువు కూడా 2019తోనే ముగిసిపోయింది. ఆ తరువాత కేంద్రం న్యాయసలహా తీసుకుంది. మరోవైపు ఈ సంస్థ కార్యకలాపాలు పూర్తిగా తెలంగాణలోనే జరుగుతున్నందున.. ఇరు రాష్ట్రాల సంస్థగా పరిగణించలేమని అటార్నీ జనరల్‌ పేర్కొంటోంది. అటార్నీ జనరల్‌ సిఫార్సులు సరైనవి కాదని ఏపి వాదిస్తోంది. ఉమ్మడి రాష్ట్ర సంపదగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తిగానే 'సింగరేణి'ని చూడాలని నొక్కి చెబుతోంది. ఈ వాదనను తెలంగాణ తోసిపుచ్చుతోంది. చట్టం మేరకు 51 శాతం వాటా తెలంగాణకే దక్కుతుందని చెబుతోంది. కేంద్రం మాత్రం అటార్నీ జనరల్‌ వాదనతో ఏకీభవిస్తూనే.. మరోమారు రెరడు రాష్ట్రాల అభిప్రాయాలు కోరినట్లు తెలిసింది.