Jul 29,2021 23:05

సినారె చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లులర్పిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - నంద్యాల: గ్రీన్‌ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి 90వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సొసైటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులు అర్పించారు. సాహితీ స్రవంతి అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, ఎన్జీవో సంఘం అధ్యక్షుడు మణిశేఖర్‌ రెడ్డి, అన్నెం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూసినారే రచించిన విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించిందని, సాహితీ సేవలో సినారె చేసిన సేవలను కొనియాడారు. శేషఫణి, మాబుబాష, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు