Aug 18,2022 23:12

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఐ నాయకులు

ప్రజాశక్తి- పెందుర్తి : సిపిఐ 27వ రాష్ట్ర మహాసభలకు సంబంధించి పోస్టర్‌ను పెందుర్తి పరిధి గిరిప్రసాద్‌నగర్‌లో ఉన్న సిపిఐ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఈ మహాసభల్లో కార్యాచరణ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి కార్యదర్శి ఎస్‌.అసిరినాయుడు, కె.నారాయణరావు, వి.లక్ష్మి, ఎ.శ్రీను, పి.సింహాచలం, రామారావు తదితరులు పాల్గొన్నారు.
మాధవధార : సిపిఐ 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు చౌదరి అప్పారావు పిలుపునిచ్చారు. సిపిఐ మాధవధార శాఖ ఆధ్వర్యాన 48ఎ బస్‌ స్టాప్‌ వద్ద గురువారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నుంచి సిరిపురం గురజాడ కళాక్షేత్రం వరకు ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఉత్తర నియోజకవర్గ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్‌, సహాయ కార్యదర్శి నెయ్యల నాగభూషణరావు, కంచరపాలెం శాఖ కార్యదర్శి నల్లయ్య తదితరులు పాల్గొన్నారు.