
వేలాడుతున్న విద్యుత్ తీగల వద్ద ఆందోళన చేపడుతున్న సిపిఎం నాయకులు, గ్రామస్తులు
ప్రజాశక్తి-రోలుగుంట: మండలంలోని ఆర్ల పంచాయతీ ఆర్ల గ్రామంలో వేలాడుతున్న విద్యుత్ వైర్లను మార్చాలని సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ, గ్రామంలో 25 సంవత్సరాల కిందటే నిర్మించిన ఎలక్ట్రికల్ పోల్స్, వైర్లు గ్రామంలో ప్రమాదంగా ఉన్నాయన్నారు. కరెంటు వైర్లు పెంకుటిల్లు, మేడలపై వాలి ఉన్నాయని, వర్షం పడినప్పుడు మరింత ఇబ్బందిగా ఉంటుందన్నారు. చిన్న పిల్లలు మెడ ఎక్కినప్పుడు చేతికి అందే విధంగా ఉన్నాయని, దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. తక్షణమే విద్యుత్‌శాఖ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పోతురాజు, రామారావు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.