Nov 25,2021 10:57

ప్రజాశక్తి-నక్కపల్లి : ఈ నెల 27, 28 తేదీలలో విశాఖ జిల్లా మన్యం కేంద్రమైనా పాడేరులో 23వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు, మండల కార్యదర్శి ఎం రాజేష్ పిలుపునిచ్చారు. మండలంలోని రాజయ్యపేట సముద్రతీరం వద్ద గురువారం ఉదయం పార్టీ గ్రామ శాఖ అధ్వర్యంలో 23 జెండాలతో, ఇసుకలో సిపిఎం లోగో వ్రాసి వినూత్న రీతిలో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఎం అప్పలరాజు మాట్లాడుతూ వైజాగ్ -చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితుల ప్యాకేజీ పైన, నిర్వాసితుల సమస్యలపై మహాసభలో చర్చిస్తామని, ఈ ప్రాంతములో విద్యా, వైద్యం కోసం రానున్న కాలములో పోరాటాలకు ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఈ ప్రాంత పేదలు, దళిత, మహిళ, వెనుక బడిన వర్గాల ప్రజలు, రైతు సమస్యలపైన సీపీఎం అలుపెరగని పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మహేష్, పీక్కి రమణ, నల్ల, జాను, అప్పలరాజు, కాశీ తదితరులు పాల్గొన్నారు.