
మనిషి జీవితంలో
మార్పుకు సంకేతం
శ్రమైక జీవన సౌందర్యానికి
తరతరాల సందేశం
జాతిని పోషించే
వ్యవసాయానికి పట్టుకొమ్మ
పల్లెపదంలో
మారని అనుపల్లవి
సరదాలకు వేదిక
సరసాలకు సరిహద్దు
ఇంటి ముందు అందాలముగ్గు
పదిమందిని కలిపే నేస్తం
పదిమందికి పెట్టే హస్తం
మంచు రవికను దాల్చి
పచ్చచీరను విడిచి
పసుపుచీరను కట్టుకొని
ముద్దమందారంలా
కనువిందు చేసే కేదారం
గాదెల్లో బంగారం
ఏడాదికోసారి
దర్శనం ఇచ్చే పెద్దపండుగ
నూతనశోభతో వచ్చింది నిండుగ
ఉండాలి అండగ
వ్యాధులు బాధలు
శోకాలు దుఃఖాలు
లేని రోజే నిజమైన పండుగ
అది చెరగని కాంతి
అది చెదరని శాంతి
అదే సిసలైన సంక్రాంతి
మంకు శ్రీను
89859 90215