Aug 07,2022 22:17

ఫొటో : హోమగుండానికి వందనం చేస్తున్న ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి

ఫొటో : హోమగుండానికి వందనం చేస్తున్న ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి
శివాలయం అభివృద్ధిలో కళ్యాణ్‌రెడ్డి కృషి అభినందనీయం
- కళ్యాణ్‌రెడ్డిపై ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రశంసలు
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : మండలంలోని మైపాడు శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి ఆలయం వైసిపి నేత దువ్వూరు కళ్యాణ్‌రెడ్డి, దాతలు ధర్మకర్తల మండలి కృషితో అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ భక్తుల అభిమానం చూరగొంటున్నట్లు కోవూరు ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శివాలయంలో నిర్వహించిన మహా కుంభాభిషేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వయంగా శివలింగానికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నేత దువ్వూరు కళ్యాణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రముఖుల సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థాన కార్య నిర్వహణలో కృషిచేసిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ సభలో ఎంఎల్‌ఎ మాట్లాడుతూ దేవస్థానం నిధులు రూ.10 లక్షలు దాతల సహకారంతో దేవస్థానం పురోగతిలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
ధర్మకర్తల మండలి పదవి స్వీకారం తర్వాత భూముల ఆదాయం ద్వారా రూ.13 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆదాయంపెంచినట్లు తెలిపారు. రూ.8 లక్షలతో ఫ్లోరింగ్‌ రూ.13లక్షలతో గర్భగుడి నిర్మాణం దాత ఇనమాల శ్రీధర్‌ రెడ్డి ద్వారా రెండు లక్షలు పైగా ఆలయ అభివృద్ధి తదితర పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోదండరామస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు బండి చంద్రశేఖర్‌ రెడ్డి, పాతూరు నాగరాజు, కల్లూరు సావిత్రి, పుట్ట ఆదెమ్మ, పోలిశెట్టి ఆదెమ్మ, ప్రసన్న, దేవస్థానం మండల సభ్యులు గంపల అనితతో పాటు శివాలయ చైర్మన్‌ కనుపూరు సురేంద్ర, ఆలయ ఇఒ తాతా శ్రీనివాసరావు, స్థానిక దాత అన్నదాన నిర్వాహకులు దుగ్గ శంకర్‌ రెడ్డి, స్థానిక సర్పంచ్‌ సంగం వెంకయ్య, మాజీ ఎంపిటిసి శ్రీహరికోటి ప్రసాద్‌, పామంజి నరసింహులు, ఆలయ పూజారి, బండారు ప్రభాకర శర్మ, మహా కుంభాభిషేకాల నిర్వాహకులు కుర్తాళం పీఠాధిపతి మాచవోలు రమేష్‌ శర్మ, తదితరులను మెమెంటోలతో సత్కరించారు. కుంభాభిషేకాల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించిన దువ్వూరు కళ్యాణ రెడ్డిని ఎంఎల్‌ఎ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైసిపి నాయకులు మండల కన్వీనర్‌ మావులూరు శ్రీనివాసులరెడ్డి, డిఎల్‌డిఎ చైర్మన్‌ గొల్లపల్లి విజరు కుమార్‌ యాదవ్‌, జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ శ్రీహరికోట జయలక్ష్మి, మోర్ల సుప్రజ, ఎంపిడిఒ పఠాన్‌ రఫీ ఖాన్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.