
మాట్లాడుతున్న కలెక్టర్
సకాలంలో పరిష్కరించాలి
నెల్లూరు:స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి అందే అర్జీలు మళ్లీ మళ్లీ పునరావతం కాకుండా సంతప్తికరస్థాయిలో సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, సంయుక్త కలెక్టర్ రోణంకి కూర్మనాథ్, డిఆర్‌ఓ వెంకటనారాయణమ్మతో కలిసి పాల్గొని జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి అందజేసిన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముందుగా జిల్లా అధికారులనుద్ధేశించి కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖలకు చెందిన అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని పిలుపు నిచ్చారు. ఒకసారి స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీ పునరావృతం కాకుండా సమస్యను పరిష్కరించేలా సత్వరమే పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన కార్యక్రమానికి వస్తున్న కొన్ని అర్జీలు గతంలో అధికారుల దృష్టికి వచ్చి పరిష్కరించబడినప్పటికీ తిరిగి మరలా అర్జీలు వస్తున్నాయని, అలా మరల వస్తున్న పరిష్కరించిన అర్జీలపై ప్రత్యేక దష్టి సారించి సంబంధిత అర్జీదారులను పిలిపించి పరిష్కారం చేయగలిగినవి చేయాలని లేని పక్షంలో ఎందువలన పరిష్కారం చేయలేకపోతున్నామో స్పష్టంగా వివరించాలన్నారు. అలాగే కోర్టు కేసులపై అశ్రద్ధ తగదని, సకాలంలో కౌంటర్లు, రిట్ పిటిషన్లు వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో బి.చిరంజీవి, డి ఆర్ డి ఏ, డ్వామా, ఏపీఎంఐపీ, గహ నిర్మాణసంస్థ పీడీలు కె.వీ. సాంబశివరెడ్డి, వెంకటరావు, శ్రీనివాసులు, వెంకట దాసు, పంచాయతీ రాజ్, జలవనుల శాఖ ఎస్‌ఈలు అశోక్ కుమార్, కష్ణమోహన్, డిఇఓ గంగాభవాని, సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, విద్యుత్ శాఖ ఎస్.ఈ. వెంకటసుబ్బయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు