Sep 15,2021 19:22

ప్రజాశక్తి - ఆకివీడు
స్కీమ్‌ వర్కర్లు ఈ నెల 24న దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల అధ్యక్షులు పెంకి అప్పారావు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద పిఒ సరస్వతికి సిఐటియు నేతలతో కలిసి స్కీమ్‌వర్కర్లు సమ్మె నోటీసు అందజేశారు. కార్యక్రమంలో కె.తవిటినాయుడు, దుర్గాభవాని, జిన్న బేబీ, ఆదిలక్ష్మి, వెంకటలక్ష్మి, కృష్ణకుమారి పాల్గొన్నారు.