
మార్టూరు రూరల్ (ప్రకాశం) : స్కార్ఫియో వాహనం స్కూటీని ఢకొీనడంతో ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటన మంగళవారం మార్టూరు సమీపంలోని రాజుపాలెం పోలీస్ చెక్ పోస్ట్ సమీపాన చోటు చేసుకుంది.
మార్టూరు ఎస్ఐ పాత చౌడయ్య తెలిపిన వివరాల ప్రకారం... యద్దనపూడి మండలం యనమదల గ్రామానికి చెందిన రైతులు వల్లూరి బ్రహ్మం (74), కోటగిరి సాంబశివరావు (73) మంచి స్నేహితులు. సాంబశివరావు మార్టూరులో పంటి వైద్యుడి దగ్గర చికిత్స తీసుకోవడానికి తన స్నేహితుడైన బ్రహ్మంని తోడు తీసుకొని తన స్కూటీ మీద మార్టూరు వెళ్ళడానికి డేగరమూడి - రాజుపాలెం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై మూసివేసిన డివైడర్ మధ్య నుండి రోడ్డు దాటుతున్నారు. అదే రోడ్డుపై హైదరాబాద్ నుండి చెన్నై వెళుతున్న స్కార్ఫియో వాహనం ఒక్కసారిగా రోడ్డు దాటున్న స్కూటీని బలంగా ఢకొీంది. దీంతో వాహనం నడుపుతున్న సాంబశివరావు ఎగిరి రోడ్డు మీద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెనుక కూర్చున్న బ్రహ్మం ప్రమాద తీవ్రతకు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ చౌడయ్య పోలీస్ సిబ్బందితో ఘటన స్థలానికి హుటాహుటిన చేరుకొని తీవ్రంగా గాయపడిన సాంబశివరావును 108 వాహనంలో మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సాంబశివరావు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మఅతి చెందినట్లు 108 సిబ్బంది పొనుగుపాటి కిషోర్, భాస్కర్ తెలిపారు. బ్రహ్మం మఅత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, సాంబశివరావు మఅతదేహానికి గుంటూరు జనరల్ హాస్పిటల్ లో పోస్ట్మార్టం నిర్వహించనున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాదానికి కారణమైన స్కార్ఫియో వాహన డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చౌడయ్య తెలిపారు.