Oct 01,2022 18:17

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు ఎన్నో చిత్రాల్లో డూప్‌గా చేసిన సాగర్‌ పాండే (50) కన్ను మూశారు. శుక్రవారం జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో జిమ్‌ ట్రైనర్‌ ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. సాగర్‌ పాండే మరణం పట్ల సల్మాన్‌ ఖాన్‌ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సెట్‌లో సాగర్‌ పాండేతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, 'ఇంతకాలం నాతో ఉన్నందుకు మనస్ఫూర్తిగా కతజ్ఞతలు చెబుతున్నా' అంటూ ట్వీట్‌ చేస్తూ నివాళులర్పించారు. సాగర్‌ పాండే ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గడ్‌లో జన్మించారు. నటుడు కావాలని ముంబై చేరుకున్నారు. సల్మాన్‌కు డూప్‌గా 50కి పైగా చిత్రాల్లో నటించారు.