Aug 08,2022 00:16

ప్రజాశక్తి-గోపాలపురం పేరు, ప్రఖ్యాతలకు తావు లేకుండా సమాజ సేవ మనస్ఫూర్తిగా అంకితభావంతో చేయాలని మానవత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షులు రామిరెడ్డి గంగాధరరావు అన్నారు. స్థానిక మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలో గోపాలపురం మండల మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం మండల అధ్యక్షులు జొన్నగడ్ల రాంబాబు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మానవత జిల్లా విద్యా కమిటీ చైర్మన్‌ ఆలపాటి నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు రామిరెడ్డి గంగాధరరావు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు సాటి మనిషి పట్ల సేవా దక్పథం కలిగి ఉండాలన్నారు. యువత సమాజ సేవకు ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమాలు చేసి ప్రాణదాతలు కావాలని తెలిపారు. పిల్లలకు విలువలతో కూడిన విద్యతో పాటు, సేవా దక్పథం, మానవతా విలువలు వారిలో పెంపొందించాలన్నారు. ఆపదలో ఉన్నవారికి మానవతా సేవా సంస్థ ఆత్మీయ సహకారం అందించేందుకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. మానవత సేవా సంస్థ చేస్తున్న సేవలకు దాతలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. వారి సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఆపదలో ఉన్న వారితోపాటు ఆర్థికంగా వెనకబడిన, అనాధలకు ఉన్నత చదువులకు చదివిం చేందుకు మానవత ఆధ్వర్యంలో సాయం చేస్తున్నట్టు చెప్పారు. మండలంలో పదో తరగతిలో ప్రథమ స్థానం సాధించిన మండా కాత్యాయని, ద్వితీయ స్థానం సాధించిన గెడ బేబీ, తతీయ స్థానం సాధించిన నాగోతు మౌనిక సాయిని వారు అభినందించారు. అత్యధిక మార్కులు సాధించిన తొమ్మిది మంది విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంశా పత్రాలు ఒక్కొక్కరికీ రూ.వెయ్యి నగదు అందజేశౄరు. తానింకి సత్యనారాయణ (బాబి) రూ.80 వేలతో ఫ్రీజర్‌ అందజేశారు. కూసం రామ్మోహన్‌ రెడ్డి రూ.25,000, జ్యేష్ట శ్రీధర్‌ రూ.5000, పోతుల అప్పిరెడ్డి రూ.5000 విరాళాలు మానవత సభ్యులకు అందజేశారు. వాదాలకుంట హైస్కూల్లో విద్యార్థులకు వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు ఆలపాటి నాగేశ్వరావు రూ.50 వేల సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముల్లంగి శ్రీనివాస్‌ రెడ్డి, గెడ జోగేంద్ర ప్రసాద్‌, నెల్లి చంద్రశేఖర్‌, ముద్దన మురళి, బూసి మురళి, రాధాకృష్ణ, గుబ్బ లక్ష్మణరావు పాల్గొన్నారు.