May 16,2022 21:09
  • ఇక భవిష్యత్‌ కార్మికులదే!

న్యూఢిల్లీ : ఇక భవిష్యత్తు అంతా కార్మికులది, కార్మిక పోరాటాలదేనని ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌టియు) 18వ మహాసభ పిలుపునిచ్చింది. ఈ నెల 6-8 తేదీల్లో ఇటలీ రాజధానిరోమ్‌లో మహాసభలు జరిగాయి. కాలపరీక్షకు నిలిచిన వర్గపోరాటాలు, శ్రామికవర్గ అంతర్జాతీయవాదం బాటలో ప్రపంచ కార్మిక వర్గం సమైక్యంగా ముందుకు సాగాలని మహాసభ పిలుపునిచ్చింది. భవిష్యత్‌ దానంతట అదే రాదని, పెట్టుబడిదారీవాదమనే బురద నుండి బయటకు లాగాల్సి వుందని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గంపై దాడులు పెరిగిపోతును నేపథ్యంలో అత్యుత్సాహమైన వాతావరణంలో, విశ్వాసాన్ని ప్రతిబింబించేలా డబ్ల్యుఎఫ్‌టియు 18వ మహాసభలు జరిగాయి. ప్రపంచ నలుమూలలా పెరుగుతును కార్మిక వర్గ పోరాటాల్లో ఈ విశ్వాసం ప్రతిబింబిస్తోంది. ప్రధానంగా యువత, మహిళలు ఈ పోరాటాలు, ఉద్యమాల్లో పాల్గంటునాురు.'' మన సమకాలీన అవసరాల కోసం, సామ్రాజ్యవాద నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, సమైక్యంగా ముందుకు సాగుదాం ! అను నినాదంతో ఈ మహాసభలు జరిగాయి.
మహాసభల సందర్భంగా డబ్ల్యుఎఫ్‌టియు ప్రధాన కార్యదర్శి సభ ముందుంచిన నివేదికపై 99మంది ప్రతినిధులు మాట్లాడారు. వీరిలో కొంతమంది ఆన్‌లైన్‌లో కూడా పాల్గొన్నారు. సిఐటియు తరపున అధ్యక్షులు హేమలత మాట్లాడారు. హేమలత, జాతీయ కార్యదర్శులు స్వదేశ్‌ దేవ్‌ రాయ్, ఎలమరం కరీం, అనది సాహూలతో కూడిన ప్రతినిధి బృందం మహాసభల్లో పాల్గొంది. ఆన్‌లైన్‌ ద్వారా మరో 15మంది సిఐటియు ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారు. టియుఐ ఎనర్జీకి ప్రాతినిధ్యం వహిస్తూ మరో జాతీయ కార్యదర్శి ప్రశాంత నంది చౌదరి కూడా మహాసభల్లో పాల్గొన్నారు.
మహాసభల చివరి రోజైన 8వ తేదీన ఐదు ఖండాలకు చెందిన 50దేశాల నుంచి ప్రతినిధులతో కొత్త ప్రెసిడెన్షియల్‌ కౌన్సిల్‌ను ఏకగ్రీవంగా ఎనుుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మైఖేల్‌ మిజ్‌వాండిలే మక్వాయిబా డబ్ల్యుఎఫ్‌టియు అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. ప్రెసిడెన్షియల్‌ కౌన్సిల్‌లో ప్రధాన కార్యదర్శి, కార్యదర్శివర్గం, ఉపాధ్యక్షులు, ఫైనాన్షియల్‌ కంట్రోల్‌ కమిటీ వుంటాయి. ప్రధాన కార్యదర్శిగా సైప్రస్‌కి చెందిన పంపిస్‌ కిరిట్‌సిస్‌ ఎనిుక కాగా, స్వదేశీ దేవ్‌ రాయ్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎనిుకవగా, హేమలత ఒక ఉపాధ్యక్షురాలిగా ఎనిుకయ్యారు. పది దేశాల ప్రాతినిధ్యంతో సెక్రటేరియట్‌, ఏడు దేశాల ప్రతినిధులతో ఫైనాన్స్‌ కంట్రోల్‌ కమిషన్‌ ఏర్పడ్డాయి.