Oct 27,2021 10:19

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లో జరిగిన టీ-20లో భారత్‌ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని కొన్ని మూకలు.. బౌలర్‌ మహ్మద్‌ షమీపై విద్వేషపూరిత వ్యాఖ్యలకు చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈ చర్యలను ఖండించిన మాజీ క్రికెటర్లు సచిన్‌, సెహ్వాగ్‌, వివి ఎస్‌ లక్ష్మణ్‌, రాజకీయ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రముఖులు షమీకి అండగా నిలిచారు. కాగా, మంగళవారం బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా (బిసిసిఐ) కూడా తన మద్దతును తెలిపింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో షమీ ఉన్న ఫోటోను షేర్‌ చేస్తూ.. గర్వంగా ఉందని, బలంగా ఉండి... ముందుకు సాగమని ట్వీట్‌ చేసింది. కాగా, షమీతో పాటు కోహ్లీని సైతం ట్రోల్‌ చేస్తున్నారు. కోహ్లీ కెప్టెన్సీలో విఫలమయ్యాడని కామెంట్లు చేస్తున్నారు.

షమీకి Bcci మద్దతు