Jun 10,2021 18:42

హైదరాబాద్‌ : టాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ రాశీఖన్నా వరుస సినిమాల్లో నటిస్తున్నా.. ప్రముఖ హీరోయిన్ల స్థానంలో ఇప్పటికీ చోటు దక్కించుకోలేకపోయింది. అయితే సమంతలా వెబ్‌సిరీస్‌లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకోనుందా అంటే.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ నిర్మాతలు ఓ వెబ్‌సిరీస్‌కి నటి రాశీఖన్నా, నటుడు షాహీద్‌ కపూర్‌ను తీసుకున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మరి రాశీఖన్నా కూడా.. సమంతలా బజ్‌ క్రియేట్‌ చేసుకుంటుందో లేదో చూడాలి.