Jun 02,2023 00:08

స్జానికులతో మాట్లాడుతున్న మంత్రి సురేష్‌

ప్రజాశక్తి-పెద్దారవీడు : ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి డాక్టర్‌ సురేష్‌ తెలిపారు. మండల పరిధిలోని ఎస్‌.కొత్తపల్లి గ్రామంలో గురువారం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా నవరత్నాల పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాచగొర్ల వెంకట సుశీల, పిచ్చయ్య యాదవ్‌, ఎఎంసి చైర్మన్‌ ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎంపిపి బెజవాడ పెద్దగురవయ్య, పుల్లలచెరువు జడ్‌పిటిసి వాగ్యనాయక్‌, సర్పంచి వెన్నా సంజీవకష్ణారెడ్డి, డివిజనల్‌ అభివృద్ధి అధికారి సాయికుమార్‌, ఎంపిడిఒ నాజర్‌రెడ్డి, డిటీ రాజేష్‌, ఎంఇఒ సిహెచ్‌.శ్రీనివాసులు, హౌసింగ్‌ డిఇ సురేష్‌ బాబు, సర్పంచులు రామాంజనేయరెడ్డి, అవులయ్య యాదవ్‌, నాగరాజు, ములా వెంకటరమణరెడ్డి, వైసిపి నాయకులు గుండా రెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, గొట్టం వేణుగోపాల్‌రెడ్డి, నందిరెడ్డి రఘునాథ్‌రెడ్డి, వజ్రాల ఆదిరెడ్డి, సోషల్‌ మీడియా నియోజకవర్గ కన్వీనర్‌ ఒద్దుల లక్ష్మిరెడ్డి, వాలంటీర్లు,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పొదిలి : పేదల సంక్షేమమే ప్రభుత్వ థ్యేయమని మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఏలూరు పంచాయతీ పరిధి సల్లూరు గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు.ప్రజల సమస్యల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్‌ గుజ్జుల రమణా రెడ్డి, జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు, మండల మాజీ కన్వీనర్‌ గుజ్జుల సంజీవ రెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ దుగ్గెంపూడి శ్రీనివాస రెడ్డి, నగర పంచాయతీ అధ్యక్షురాలు ఎస్‌కె.నూర్జాహన్‌ బేగం, శివాలయం ట్రస్టుబోర్డు చైర్మన్‌ యక్కలి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.