Aug 18,2022 23:19

సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి-గొలుగొండ:సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ అన్నారు. మండలలోని ఏటిగైరంపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఏటిగైరంపేట నుంచి కొత్తపట్నం వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గజ్జలపు మణికుమారి, జెడ్పీటీసీ గిరిబాబు, మండల వైసిపి అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, వైసిపి మండల ప్రధాన కార్యదర్శి, పుత్తడిగైరంపేట సర్పంచ్‌ రమణ, పాల్గొన్నారు.
నేడు గడప గడపకు మన ప్రభుత్వం
గొలుగొండ:మండలంలోని ఏటిగైరంపేట పంచాయతీ శివారు గ్రామాలు ముంగర్లపాలెం, సీతకండిలో ఈ నెల 19న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తామని మండల వైసిపి అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సీపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ హాజరవుతారని, నాయకులు, ప్రజాప్రతినిధులు అధికారులు హాజరు కావాలని కోరారు.