Jul 29,2021 22:13

మాట్లాడుతున్న ఎపిటిఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కన్వీనర్‌ బికె.ముత్యాలప్ప

ప్రజాశక్తి-గుత్తి    తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఎపిటిఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. కార్యాలయం ఎదుట శిబిరం ఏర్పాటు చేసుకుని వారు ఆందోళన చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఉద్యోగుల సంఘం నాయకులు ధర్నాకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం సిపిఎస్‌ను రద్దు చేయాలని,11వ పిఆర్‌సిని అమలుచేయాలని, 6 డిఎలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎస్‌ నాయకులు జయరామ్‌, మధుబాబు, దేశాయి నాగరాజు, పి.వెంకటరామిరెడ్డి, ఆర్‌ఐ చాంద్‌బాషా, వీఆర్వోలు భరత్‌, నాగరాజు, అంజి, పవిత్ర, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సి.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
ఉరవకొండ రూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 11వ పిఆర్‌సిని వెంటనే అమలుచేయాలని ఎఇపిటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.హనుమప్ప డిమాండ్‌ చేశారు. గురువారం ఎపిటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉరవకొండ తహశీల్దార్‌ కార్యాలయం ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప, రాష్ట్ర కౌన్సిలర్‌ ధనంజయ, జిల్లా ప్రత్యేక ఆహ్వానితులు సాకే.భాస్కర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వాచ్‌మెన్‌, అటెండర్‌, స్కావెంజర్‌, స్వీపర్‌, రికార్డు అసిస్టెంట్‌ తదితర పోస్టులను భర్తీచేయాలని, బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని, మోడల్‌ స్కూల్‌, కెజిబివి, గురుకుల పాఠశాలలను పాఠశాల విద్యా శాఖలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్‌ ఉరవకొండ, విడపనకల్‌, వజ్రకరూర్‌ మండలాల అధ్యక్షులు నాగేంద్ర, రాజేష్‌, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు మనోహర్‌, నారాయణస్వామి, ఇమామ్‌, సరస్వతి, విజయభారతి, యమునమ్మ, చంద్రశేఖర్‌, బిసి ఓబన్న, కిషోర్‌, నజీర్‌, దాదా ఖలందర్‌ పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుంటే ఐక్య పోరాటాలకు సిద్ధం అవనున్నట్లు ఎపిటిఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కన్వీనర్‌ బికె.ముత్యాలప్ప హెచ్చరించారు. ఎపిటిఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ముత్యాలప్ప మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విద్యాశాఖ, రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ నాగేశ్వరి, జిల్లా ప్రత్యేక ఆహ్వానితులు బలరాముడు, ధర్మవరం జోన్‌ నాయకులు చంద్రశేఖర్‌ గౌడ్‌, శ్రీనివాస్‌, రవీంద్రారెడ్డి, శంకరనారాయణ, వాసుకుమార్‌ పాల్గొన్నారు.
మడకశిర రూరల్‌ : సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని, పీఆర్సీ నివేదిక వెల్లడించాలని ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్‌ జిల్లా నాయకులు రామకష్ణ, లత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పుట్టపర్తి అర్బన్‌ : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఎపిటిఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తాలూకా పరిధిలోని 16 మండలాల ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ గోపాలకష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కోనంకి అశోక్‌ కుమార్‌, జెఎసి అధ్యక్షులు లింగ రామ్మోహన్‌, పుట్టపర్తి మండల అధ్యక్ష, కార్యదర్శులు కిలారి హరిప్రసాద్‌, శ్యామ్‌ సుందర్‌, సాయి, శివ, రాజశేఖర్‌లు పాల్గొన్నారు.