Mar 27,2023 20:23

వినతిపత్రం సమర్పిస్తున్న ఆటో యూనియన్‌ నాయకులు

వినతిపత్రం సమర్పిస్తున్న ఆటో యూనియన్‌ నాయకులు
సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం
-ట్రాఫిక్‌ డిఎస్పీ హామీతో వాయిదా పడ్డ ధర్నా
నెల్లూరు:ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామని ట్రాఫిక్‌ డిఎస్‌పి హామీ ఇచ్చారు. సోమవారం జిల్లా ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆటోలపై ట్రాఫిక్‌ పోలీసులు విధిస్తున్న ఈ ఛలనా రద్దు చేయాలని, ఆటో దొంగతనాలను అరికట్టాలని, పోలీసు నెంబర్ల పేరుతో ఏజెన్సీ నిర్వాహకుల దోపిడి నివారించాలని డిమాండ్‌ చేస్తూ ఛలో కలెక్టరేట్‌ కార్యక్రమం చేపట్టాలని పిలుపు నిచ్చాయి. ఈ సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్‌ డిఎస్‌పి ఆటో యూనియన్‌ నాయకులను చర్చలకు ఆహ్వానించారు. ఈ చర్చల్లో పాల్గొన్న ఆటో యూనియన్‌ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఆటో కార్మికుల జీవితాలు నేడు భారంగా మారాయని ఈ తరుణంలో పోలీసులు ఈ చలానాల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఇటీవల కాలంలో ఆటో దొంగతనాలు అధికమైనయని, ఆటో పార్కింగ్‌ చేస్తే ఆటోలోని బ్యాటరీలు, టైర్లతో పాటు ఆటోల సైతం దొంగతనానికి గురౌతున్నాయన్నారు.
గత వారంలోనే రెండు ఆటోలు దొంగతనాలు జరిగాయన్నారు, నిఘా ఏర్పాటు చేసి దొంగలను అరికట్టాలని కోరారు, పోలీస్‌ నెంబర్ల పేరుతో రెన్యువల్‌ పేరుతో ఏజెన్సీలు గ్రామీణ ప్రాంత ఆటోలో నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆటో డ్రైవర్లకు ఏజెన్సీ నిర్వాహకులు బెదిరిస్తున్నారని తెలిపారు, అనంతరం ట్రాఫిక్‌ డిఎస్పీ మాట్లాడుతూ ఆటో ఈ చలానాలపై పరిశీలిస్తామని, దొంగతనాలు నివారణకు ప్రత్యేక బందాలు ఏర్పాటు చేస్తామని, పోలీస్‌ నెంబర్లు రెన్యువల్‌ చేసుకోనవసరం లేదని హామీ ఇచ్చిరు. డిఎస్‌పి నుంచి ఆటో యూనియన్‌ నాయకులకు స్పష్టమైన హామీ రావడంతో ఛలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్‌ జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు మారుబోయిన రాజ, కె.సురేష్‌, కోశాధికారి వెంకయ్య ,జిల్లా సహాయ కార్యదర్శి ఎం. సుధాకర్‌, జిల్లా నాయకులు బుచ్చి రాధయ్య ,రాజుపాలెం సురేష్‌ తదతరులు పాల్గొన్నాను.