Aug 18,2022 21:17

గంట్యాడ: రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బొత్స

ప్రజాశక్తి- గంట్యాడ : సమస్యలుంటే తనకు తెలియజేస్తే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అన్నారు. గురువారం పెనసం గ్రామంలోని గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకున్న సమస్యలను వెంటనే పరిష్కరించడం జరుగుతోందన్నారు. గ్రామ సర్పంచ్‌ కర్రోతు పాపమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి. సురేష్‌ బాబు, జెడ్‌పిటిసి వరి నరసింహమూర్తి, ఎంపిపి పీరుబండి హైమావతి, ఏఎంసీ చైర్మన్‌ వేమలి ముత్యాల నాయుడు, డిసిఎంఎస్‌ డైరెక్టర పి. నారాయణ మూర్తి రాజు, ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు పీరు బండి జైహింద్‌ కుమార్‌, వైస్‌ ఎంపిపిలు సుంకరి సుజాత, కిలపర్తి వెంకటలక్ష్మి, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
శృంగవరపుకోట: సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని సచివాలయం 5 పరిధిలో గల సీతమ్మపేటలో ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాల గూర్చి అడిగి తెలుసుకుని వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమంలో కూనిరెడ్డి వెంకట్రావు, షేక్‌ రెహమాన్‌, బుగతా వెంకటేశ్వరరావు,,మోపాడ కుమార్‌, దాడి రామకృష్ణ, కడారి అప్పయ్య, కడారి జై శంకర్‌, మామిడి బుజ్జి, మోపాడ కోటి, వేమలి జగదీష్‌, చిప్పాడా రమణ తదితరులు పాల్గొన్నారు.