Oct 18,2020 23:55

 మార్టూరు రూరల్‌ :  సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని పాండురంగాపురం బీచ్‌ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. బాపట్ల రూరల్‌ ఎస్‌ఐ కిరణ్‌ కథనం ప్రకారం... మార్టూరు అంబేద్కర్‌ కాలనీకి చెందిన అట్లూరి మోజెస్‌ (19),గల్లా రాజేష్‌(17) మార్టూరు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. స్నేహితులతో కలిసి మొత్తం 13 మంది కలిసి బాపట్ల సూర్యలంక బీచ్‌ వద్దకు వెళ్లారు. సముద్రంలో మునిగేందుకు పోలీసులు అనుమతించ లేదు. దీంతో పాండు రంగాపురం బీచ్‌ వద్దకు వెళ్లారు. సముద్రంలో మును గుతున్న సమయంలో మోజెస్‌, రాజేష్‌ అలల తాకిడికి తాళలేక గల్లంతయ్యారు. వారి స్నేహితులు రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. రూరల్‌ ఎస్‌ఐ కిరణ్‌ తమ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. మార్టూరులోని బంధువులకు సమాచారం అందించారు.