Nov 30,2022 22:48

కోలంక సహకార సంఘం వద్ద మాట్లాడుతున్న డి.ఎం. పుష్పమణి


ప్రజాశక్తి - కాజులూరు
ధాన్యం బట్వాడాకు సంచులు సకాలంలో సరఫరా చేయడం జరుగుతుందని సివిల్‌ సప్లయిస్‌ డి.ఎం. డి.పుష్పమణి తెలిపారు. బుధవారం కాజులూరు మండలంలోని కుయ్యేరు, కోలంక రైతు భరోసా కేంద్రాలను పుష్పమణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా సంచులు అందిచనున్నట్టు తెలిపారు. చిన్న రైతులు ధాన్యం అమ్మకానికి ఇబ్బందులు పడుతున్నారని తన దష్టికి వచ్చిందన్నారు. చిన్న రైతులు వారి ధాన్యానికి సరిపడా వాహనాలను ఏర్పాటు చేసు కొన్నట్లయితే దానికి కిరాయి, హమాలీ చార్జీలు రైతులు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. జిల్లాలో రెండు లక్షల 41 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 52 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు. రైతులు ఎవరు కంగారుపడి ధాన్యాన్ని దళారులకు అమ్మ వద్దని డిఎం పుష్పమణి సూచించారు. ఆమె వెంట తహశీల్దార్‌ సత్యనారాయణ సచివాలయ వ్యవసాయ శాఖ సహాయకులు ప్రసాద్‌, సురేష్‌, కోలంక సహకార సంఘ అధ్యక్షులు వత్సవాయి రామకృష్ణంరాజు, సహకార సంఘ కార్యదర్శి రామన్న సహకార సంఘ గోవిందరాజు, లక్ష్మీపతి రాజు రెవెన్యూ సిబ్బంది పలువురు రైతులు, కౌలురైతులు పాల్గొన్నారు.