
సంగ్రామ యాత్రకు ఘన స్వాగతం
ప్రజాశక్తి మర్రిపాడు : ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు ఎంఎస్‌పి జిల్లా కన్వీనర్ పందిటి అంబేద్కర్ మాదిగ చేపట్టిన రెెండో విడత మాదిగల సంగ్రామ పాదయాత్ర 12వ రోజు రాంపల్లి చేరుకొనగా, ఎంఎస్‌పి సీనియర్ నాయకులు బొద్దుకూరి మహేష్ మాదిగ నేతృత్వంలో మొదలై నందవరం డిసిపల్లి గ్రామానికి చేరుకోగా ఎంఎస్‌పి, ఎంఆర్‌పిఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూమార్చి 31న కలెక్టర్ కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణకు చేస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం నేటికీ 9 సంవత్సరాలు గడుస్తున్న వర్గీకరణ బిల్లు పెట్టకపోవడం మాదిగలను కేంద్ర ప్రభుత్వం మోసం చేయడమేనని ఆయన మండిపడ్డారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో వర్గీకరణ బిల్లు పెట్డాలని లేదంటే బిజెపిని అడుగడుగునా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. అదేవిధంగా 31న జరిగే కలెక్టరేట్ ముట్టడికి జిల్లా నలుమూలల నుండిఅధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఎస్‌పి సీనియర్ నాయకులు సోంపల్లి హజరత్ మాదిగ, నాగిపోగు రమేష్ మాదిగ, నల్లిపోగు అంకయ్య, నల్లిపోగు చిన్నయ్య, పోలిచర్ల రామయ్య, నల్లిపోగు శ్రీను, పోలిచర్ల శ్రీనివాసులు, బి.చంటియ్య, తిరపాలు, బి.బద్రినాధ్, రమేష్, విద్యార్థులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.