May 16,2022 20:05

శ్రీజ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌పై ఏడిద శ్రీరామ్‌ సమర్పణలో ఆయన కుమార్తె ఏడిద శ్రీజ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆమె నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో'. ఈ చిత్రానికి 'జాతిరత్నాలు' ఫేమ్‌ అనుదీప్‌ కె.వి స్టోరీ స్క్రీన్‌ ప్లే డైలాగ్స్‌ అందిస్తున్నారు. వంశీధర్‌ గౌడ్‌ లక్ష్మీ నారాయణ.పి ఈ సినిమా ద్వారా దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కనున్న ఈ మూవీలో శ్రీకాంత్‌ రెడ్డి సంచిత బసు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. క్లాసికల్‌ మూవీగా నిలిచిన 'శంకరాభరణం' చిత్రంతో పాటు ఎన్నో అత్యుత్తమ చిత్రాలని అందించి తెలుగు చిత్రసీమలో తమకంటూ ప్రత్యేకతని చాటుకున్న పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనుమరాలే శ్రీజ.