Jan 15,2022 16:55

ప్రజాశక్తి-సింగరాయకొండ: సింగరాయకొండ మండలం పాకల గ్రామంలోని హెల్ప్ టు హెల్ప్ లెస్ సొసైటీ వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా వృద్ధులకు వికలాంగులకు సుమారు 150 మందికి భోజనాలు పెట్టి దుప్పట్లు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఒంగోలు పార్లమెంటు వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి రిటైర్డ్ గవర్నమెంట్ డాక్టర్ బి బ్రహ్మయ్య పాల్గొనడం జరిగినది. డాక్టర్స్ మాట్లాడుతూ పండుగ దినాన ఎంతోమంది నిరుపేదలకు వృద్ధులకు భోజనాలు పెట్టి చలికి దుప్పట్లు ఇవ్వటం చాలా ఆనందదాయకంగా భావించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఆర్ బ్రహ్మయ్య పాల్గొనడం జరిగినది.