Oct 03,2022 00:22

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎల్‌సి ఐ వెంకటేశ్వరరావు


-నాడు - నేడు నిధులు కేటాయించాలి
- మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలి
-పి.డి.ఎఫ్‌ ఎంఎల్‌సి ఐవి డిమాండ్‌

ప్రజాశక్తి - కాకినాడ
భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌.ఎఫ్‌.ఐ) కాకినాడ జిల్లా ప్లీనరీ సమావేశాలు రెండో రోజు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతి సందర్భంగా గాంధీ చిత్ర పటానికి సీనియర్‌ నాయకులు కే.ఎస్‌ శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి. రాము, టి. రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉభయ గోదావరి జిల్లాల పట్టబధ్రుల ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వర రావు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్‌ పరిస్థితి అద్వానం అన్నారు. సంక్షేమ హాస్టల్‌ అన్నింటికి నాడు నేడు నిధులు కేటాయించి నూతన బిల్డింగులు నిర్మాణం చేయాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నూతన జాతీయ విద్యా విధానాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసి ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తోందన్నారు. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ పాఠశాల నుండి ప్రైవేట్‌ పాఠశాల లకు మూడు లక్షల 50 వేల మంది విద్యార్థులు ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల వెళ్లిపోయారన్నారు. సంక్షేమ ప్రభుత్వం చెప్పుకుంటూ సంక్షేమ హాస్టల్‌ కు కనీసం నిధులు కేటాయించక పోవడం దారుణమన్నారు. కాకినాడ నగరంలో ఎస్సీ కళాశాల హాస్టల్‌ లో స్లాబ్‌ కూలి ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన నేటికీ పాలకులు అధికారులు హాస్టల్‌ నూతన భవన నిర్మాణం కోసం కషి చేయకపోవడం దారుణమన్నారు. కాకినాడ నగరంలోని ఇటువంటి పరిస్థితి ఉంటే మారుమూల ప్రాంతాల్లో సంక్షేమా హాస్టల్లో పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. పథకాలకు పేర్లు మార్చి నిధులు తగ్గిస్తున్నారన్నారు. అంబేద్కర్‌ విదేశీ విద్యా పథకం పేరును తొలగించి జగనన్న విదేశీ విద్య పథకం పేరు మార్పు చేయ డానికి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్‌ యూని వర్సిటీ పేరును మార్చడం కంటే కొత్త యూనివర్సిటీల కట్టి పేర్లు పెట్టుకోమని జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వా నికి సూచన చేశారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి రాము, టి రాజా జిల్లా నాయకులు వరహాలు, మణికంఠ, శివరాజు, అరుణ్‌, రవీంద్ర, లలిత, రమ్య, ప్రవీణ్‌, సాహిత్‌, సరిత, రోహిత్‌, వాసు, లోవరాజు, రాంబాబు, వీరబాబు, పావని, శతి,స్నేహ, చైతన్య, మనోజ్‌, బన్ని తదితరులు పాల్గొన్నారు.