May 28,2023 18:09

మంత్రి వేణు గోపాలకృష్ణ
ప్రజాశక్తి-రామచంద్రపురం
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వారధులుగా వాలంటీర్లు నిలుస్తున్నారని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని కె.గంగ వరం, కాజులూరు, రామచంద్రపురం మండల వాలంటీర్లతో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తున్న వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. రామచంద్రపురం పట్టణన్ని గార్బేజ్‌ ఫ్రీ జోన్‌ గా చేసేందుకు చర్యలుచేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. దీనికోసం జిల్లా కలెక్టర్‌ సహకారంతో స్వచ్ఛ, స్వేచ్ఛ, సేవ, స్నేహ రామచంద్రపురంగా చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. బిసిల సంక్షేమానికి వైసిపి ప్రభుత్వంలో గుర్తింపు లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో 5 వాలం టీర్లకు సేవా వజ్ర అవార్డు ప్రదానంతో పాటు రూ.30 వేల నగదు, మండల, మునిసి పాలిటీల్లో 20 సేవారత్న అవార్డులతో పాటు రూ.20 వేలు, మిగిలిన అందరికీ సేవా మిత్ర అవార్డులు రూ.10వేలతో సత్కరిస్తున్నామన్నారు. అవార్డుల్లో సేవా వజ్ర, సేవరత్న,సేవా మిత్రులు అవార్డులుగా ఉంటాయన్నారు. రామచంద్రపురం నియోజ కవర్గంలో 1434 సేవా మిత్రా, 20 మంది సేవా రత్న, 5 సేవా మిత్రులకు మొత్తం 1,459 మం దికి సత్కరించామని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పండు గోవిందరాజు, వైసిపి నాయకులు పెట్టా శ్రీనివాస్‌, ఇళ్ళ సూర్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యుడు మేర్నిడి వెంకటేశ్వరరావు, ఎంపిపి అంబటి భవాని, పురపాలక సంఘం అధ్యక్షులు గాదంశెట్టి శ్రీదేవి, కె.గంగవరం, ఎంపిపి నాగమణి, కాజులూరు, ఎంపిపి యం భారతీ, కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి, ఎంపిడిఒలు, గ్రామ సర్పంచ్‌ లు, ఎంపిటిసి సభ్యులు, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.