Apr 20,2021 21:48

తాడిపత్రిలో అభిమానులకు కేక్‌ తినిపిస్తున్న జెసి.ప్రభాకర్‌రెడ్డి

       అనంతపురం : రాష్ట్రం, ప్రజలు అభివృద్ధి పథంలో పయనించాలని నిరంతరం పరితపించే సంక్షేమ సారధి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పలువురు టిడిపి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అనంతపురం జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించారు. కోవిడ్‌ నేపథ్యంలో నిరాడబరంగా వేడుకలను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు జెసి.ప్రభాకర్‌రెడ్డి, వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు ఉమామహేశ్వరనాయుడు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు భారీ కేక్‌ కట్‌ చేశారు. అభివృద్ధి నినాదంతో ముందుకెళ్లిన చంద్రబాబు నాయుడు పాలన చరిత్రలో నిలిచిపోతుందని నాయకులు చెప్పారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి చంరదబాబు నాయడు పాలనలోనే జరిగిందని తెలిపారు.