Jun 23,2022 14:23

ప్రజాశక్తి - సీతానగరం : సోమవారం కాటవరంలో జరిగిన నిరసనలో వంగలపూడి ర్యాంపులో పనిచేస్తున్న కూలీల మేస్త్రి వాస్తవానికి విరుద్ధంగా ఒక ఆరోపణ చేయడం జరిగిందని మాజీ జడ్పీటిసి కొంచ చంద్ర భాస్కరరావు తెలిపారు. పత్రికా సమావేశంలో భాస్కరరావు మాట్లాడుతూ జరిగిన వాస్తవం ఎమిటంటే గత నాలుగు రోజుల క్రితం వంగలపూడి ర్యాంపు మొదలయినప్పటినుండి రోజుకు 35 నుండిి 40 లారీలు వస్తున్నాయి. పగలు 40 మంది, రాత్రి 40 మందితో కలసి వంగలపూడి గ్రామానికి చెందిన 10 మంది స్టాఫ్ పని చేయడం జరుగుతుంది. రెండు సార్లు మేస్త్రిలంతా కలిసి కార్మికులను పెంచాలని అడిగారు. ర్యాంపుకు ఎక్కువ మొత్తంలో వాహనలు వస్తే గనుక పెంచుదాం అన్నాను. ప్రస్తుతం జగనన్న కాలని, నాడు - నేడు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలకు సంబంధించి వాహనాలు ఉచితంగా వెళ్తున్నాయి. కొంత వెసులు బాటు కలిగిన తరువాత  కూలీలను పెంచదాం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాంపు నిలిచిపోవడం జరిగింది, అయితే గతవారం నుండి ర్యాంపు ప్రారంభం అయ్యింది. నేనుకూడా గ్రామం తరుపున 20 మంది కూలీలను పెంచమని ర్యాంపు నిర్వాహకులకు చెప్పడం జరిగింది. అయినప్పటికి నామాటను భేఖాతరు చేసి వాళ్ళే డైరక్టగా ఇసుక ర్యాంపు నిర్వాకులతో మాట్లాడుకుని 700/- రూపాయలు దినసరి వేతనం ఇచ్చే విధంగా, 150 మందికి కూలీలు పెంచే విధంగా డిమాండ్ చేయడం జరిగింది. ర్యాంపు నిర్వాహకులైతే దినసరి వేతనం 600/- రూపాయలు, 100 మందికే పని కల్పిస్తామని చెప్పారు. కార్మికులు ఒప్పుకోలేదు. 150 మందికి పకల్పిస్తేనే ర్యాంపు నిర్వహించాలని లేక పోతే ర్యాంపు ను అడ్డు కుంటామని తేల్చిచెప్పారు. తరువాత పరిణామాల్లో నన్ను ర్యాంపుకు పిలిచి ఏదోకటి సరివేయమని చెప్పారు. 700/- రూపాయులు డిమాండ్ పై గ్రామంలో ఉన్న రైతాంగం నా తుగ్గరకు వచ్చి 700/- రూపాయిల కూలీ ఇస్తే వ్యవసాయం కుదేలవుతుందని వాపోయారు. ఈ విషయం జట్టు కార్మికుల దృష్టి పెట్టి సామరస్యంగా వెళదాం అని అప్పుడం జరిగింది.600/- రూపాయలతో కూలి నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగిందిగింది. ఆ పరిస్థితుల్లో కూలీల వరకూ 100 మందికి  అంగికరించి, మేము జట్టు మేస్త్రిలం ఉన్నాం 10 మందికి వెసులుబాటు కల్పించాలి మేము కూడా ర్యాంపు లోనే  ఉంటాం, మాకూ కూడా వేతనం ఇవ్వాలన్నారు. దానిపై జుట్టు కూలీలు కుదరదని చెప్పారు. మరో వైపు ర్యాంపు నిర్వాహకులు. 100 మందికి తప్పితే ఎవరికి పని లేదని తేల్చి చెప్పడం జరిగింది. నేను కూలీలను పిలిచి 100 మంది పనికి కుదుర్చుకుందాం అని కార్మికులకు నచ్చ జెప్పడం జరిగింది. ఈ విషయం స్థానిక ఎమ్యె దృష్టిలో పెడితేనే గాని కార్మికులకు న్యాయం జరిగేలా లేదని చెప్పడం కూడా జరిగింది. ర్యాంపు నిర్వహిస్తున్న జెపి సంస్థ 35 నుండి 40 లారీలు వస్తున్నాయని ర్యాంపు గిట్టుబాటు కావడం లేదని మూసివేయడానికి సిద్ధపడ్డారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలకు, జగనన్న కాలనీ, నాడు - నేడులకు ఇక్కడ నుండే ఇసుక తరలించాలని స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వత్తిడి  తీసుకు వచ్చి ర్యాంపు నిర్వహించేందుకు మాట్లాడటం జరిగింది.సామవారం జరిగిన కాటవరం ర్యాంపు నిరసనలో ముగ్గురు మేస్త్రీలను అడ్డుపెట్టుకు 80 మందికే పని అని స్థానిక ఎమ్మెల్యే పై బురద జల్లుతున్నారన్నారు. గతంలో ఇసుక దోపిడి దారులే ఎదోవిధంగా ర్యాంపు నిలిపి వేయడానికి కూలీలను అడ్డు పెట్టుకొంటున్నారని తెలిపారు. దయచేసి కార్మికులందరూ అర్థం చేసుకుని, మూడు సంఘాల్లో కూడా అదనంగా పదిమంది చొప్పున చేర్చుకుని, అందరికి ఉపాధి కల్పించాలని కోరుతున్నాను. ర్యాంపులో తిరిగి పనులు చేసుకోవడానికి సహకరించాలని కూలీలను కోరారు. ఈ పత్రికా సమావేశంలో వంగలపూడి, సింగవరం గ్రామానికి చెందిన పలువురు ఇసుక ర్యాంపు కార్మికులు, వైసీపీ నాయకులు అంబటి రమణ, వంగలపూడి ఎంపిటిసి తదితరులు పాల్గొన్నారు.