Jul 03,2022 22:33
  • జమ్ము ప్రావిన్స్‌ ఐటి సెల్‌ నేతగా తీవ్రవాది
  • రాజస్థాన్‌ హత్య కేసు నిందితుడూ బిజెపి కార్యకర్తే
  • కాషాయ ఉగ్రవాదంపై నివ్వెరపరిచే వాస్తవాలు

శ్రీనగర్‌/న్యూఢిల్లీ : ఉగ్రవాదులు, నరహంతకులతో బిజెపికి ఉన్న అనుబంధాలు వరుసగా వెలుగులోకి వస్తుండటం దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. రాజస్థాన్‌లో దర్జీ హత్య కేసు నిందితుల్లో ఒకడు బిజెపి కార్యకర్త అనితేలిన కొద్ది రోజులకే మరో ఉగ్రబంధం బయటపడింది. జమ్ముకాశ్మీర్‌లో ఆదివారం ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్తులు సాహసోపేతంగా బంధించి పోలీసులకు అప్పగించగా..వారిలో ఒక ఉగ్రవాదిని బిజెపికి చెందిన క్రియాశీలక కార్యకర్తగా గుర్తించారు. అతడు జమ్ము ప్రావిన్సు మైనార్టీ మోర్చా ఐటి సెల్‌ ఇంఛార్జీగా పనిచేస్తునుట్లు నిర్ధారణైంది. కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో కొనసాగుతును ఒక జాతీయ పార్టీ ఉగ్రమూలాలు అటు రాజస్థాన్‌లోనూ ఇటు సునిుతమైన జమ్ముకాశ్మీర్‌ ప్రాంతంలోనూ బయటపడటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ప్రభుత్వ రంగ సంస్థలను, సహజ వనరులను కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెడుతూ కార్పొరేట్ల సేవలో తరిస్తును మోడీ సర్కార్‌ ఆ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకుమత విద్వేషాలు రాజేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకుయతిుస్తునుది. ఇప్పుడీ ఉగ్రవాద మూలాలు కూడా బయటపడడంతో బిజెపి ఇరకాటంలో పడింది.

  • జమ్ములో గ్రామీణుల సాహసంతో బిజెపి ఐటి సెల్‌ నేత సహా ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

జమ్మూలోని రేయాసి ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందిన ప్రజలు ఆదివారం నాడు సాహసోపేతంగా స్పందించి ఇద్దరు ఉగ్రవాదులను ఇంట్లో బంధించారు. మారణాయుధాలు, పేలుడు పదార్థాలతో సహా వారిని అదుపులోకి తీసుకున్న గ్రామస్తులు అనంతరం ఇరువురిని భద్రతాబలగాలకు అప్పగించారు. లష్కరే తోయిబాకు చెందిన ఈ ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకడు తాలిబ్‌ హుస్సేన్‌ షా, మరొకడు అతని అనుచరుడు. అయితే తాలిబ్‌ హుస్సేన్‌ షాను జమ్ముకాశ్మీర్‌లో బిజెపి క్రియాశీలక కార్యకర్తగా గుర్తించారు. సదరు ఉగ్రవాది బిజెపి అనుబంధ మైనార్టీ మోర్చా జమ్ము ప్రావిన్సు సోషల్‌ మీడియా విభాగం ఇంఛార్జీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తునుట్లు తేలింది. దీంతో భద్రత బలగాలు సైతం నివ్వెరపోయాయి. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసిన భద్రతాబలగాలు, వారి నుంచి ఎకె రైఫిళ్లు, పలు గ్రనేడ్లు, ఇతర మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

  • ఆన్‌లైన్‌ సభ్యత్వంపై నెపం

బిజెపి మైనార్టీ మోర్చా విభాగం సోషల్‌ మీడియా నేత తాలిబ్‌ హుస్సేన్‌ షా మోస్ట్‌ వాంటెండ్‌ ఉగ్రవాది అని తేలడంతో బిజెపి నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. నెపానిు ఆన్‌లైన్‌ సభ్యత్వంపైకి నెట్టేసి చేతులు దులిపేసుకోవాలనిచూసింది. నేపథ్యాన్ని తెలుసుకోకుండా ఆన్‌లైన్‌లో మెంబర్‌షిఫ్‌ చేపట్టడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బిజెపి అధికార ప్రతినిధి ఆర్‌ఎస్‌ పఠానియా తెలిపారు. ' ఈ అరెస్టుతో కొత్త సమస్య వెలుగులోకి వచ్చింది. బిజెపిలోకి వచ్చేందుకు ఇదో కొత్తరకం ఎత్తుగడ'గా ఆయన పేర్కొనాురు. అయితే మోస్ట్‌ వాంటెండ్‌ ఉగ్రవాదులను కూడా సభ్యులుగా చేర్చేసుకొనే అంతటి లోపభూయిష్టమైన ఐటి విభాగం బిజెపికి ఉందా అనంటే 'సరైన తనిఖీ వ్యవస్థ లేకపోవడం వల్లే ఇలాంటివి ఉత్పన్నమవుతాయంటూ దాటవేసే ప్రయతుం చేశారు. ఒకవేళ ఆన్‌లైన్‌ సభ్యత్వం అంటే నేపథ్యానిు తనిఖీ చేయకుండా ఇచ్చి ఉండవచ్చు..కానీ నాయకత్వ బాధ్యతలను కూడా అలానే ఇస్తారా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు బిజెపి జమ్ముకాశ్మీర్‌ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనాతో పాటు పలువురు సీనియర్‌ బిజెపి నేతలతో తాలిబ్‌ హుస్సేన్‌ షా ఫొటోలు కూడా దిగారు. కాగా సాహసోపేతంగా ఉగ్రవాదులను బంధించి అప్పగించిన రేయాసి గ్రామస్తులకు లెఫ్టినెంట్‌ గవర్నరు, జమ్ముకాశ్మీర్‌ పోలీసు ఛీఫ్‌ నగదు రివార్డును ప్రకటించారు. 'రేయాసి జిల్లా తుక్సాన్‌ గ్రామ ప్రజలకు హ్యాట్సాప్‌. ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మారణాయుధాలతో సహా బంధించి అప్పగించారు. గ్రామస్తులకు డిజిపి రూ.2 లక్షల రివార్డు ప్రకటించారు' అని జమ్ము పోలీసు అదనపు డిజి ట్వీట్‌ చేశారు.

  • చాలా తీవ్రమైన అంశం : ఏచూరి

బిజెపికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి రావడం పట్ల సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. 'ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. అధికార బిజెపి దీనికి సమాధానం చెప్పాలి' అని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఉగ్రవాద సంబంధాలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాలి. అది జమ్ముకాశ్మీర్‌ కానీ, లేదా రాజస్థాన్‌ కానీ ఉగ్రమూలాలపై దర్యాప్తు జరపాల్సిందేనని ఏచూరి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.