Nov 29,2021 13:25

గుడుపల్లి (చిత్తూరు) : గుడుపల్లి మండలంలోని సోడిగానిపాళ్యంలో ఏనుగులు హల్‌చల్‌ చేశాయి. సోడిగానిపాళ్యం గ్రామ పరిసరాల్లో సోమవారం వేకువజామున ఏనుగుల గుంపు చొరబడింది. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 45 బస్తాల వడ్లను తిని తర్వాత ఆ వడ్ల బస్తాలను ధ్వంసం చేశాయి. గమనించిన సదరు రైతు వెంకటేష్‌, అతని కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. ఓ వైపు వర్షాలు.. మరోవైపు ఏనుగుల దాడులు.. తమ పంటల్ని ఎలా కాపాడుకోవాలంటూ.. రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.