Oct 15,2020 20:08

న్యూఢిల్లీ : ఏడు నెలల సుధీర్ఘ విరామం అనంతరం ఢిల్లీలో నేడు సినిమా థియేటర్లు ప్రారంభమయ్యాయి. కేవలం నలుగురు ప్రేక్షకులు మాత్రమే షోకు వచ్చారు. అన్‌లాక్‌.5లో భాగంగా కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరవవచ్చని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు థియేటర్‌కు నలుగురు ప్రేక్షకులే వచ్చినట్లు థియేటర్‌ యాజమాన్యం తెలిపింది. ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాష్‌ ప్రాంతంలోని ఈ థియేటర్‌కు 11.30- 2.30 షోకి నాలుగు టికెట్లు మాత్రమే విక్రయించినట్లు వెల్లడించారు.