Nov 21,2020 20:32

 హైదరాబాద్ : కరోనా కాలంలో జనాన్ని తమ సొంత ఇళ్లకు చేర్చడంలో హీరో సోనూసూద్‌ సహాయం చేశాడు. ఇప్పుడు ఆపదలో ఉన్న వాళ్లని ఆదుకుంటున్నాడు. అతని మానవ సేవను కొనియాడుతూ నటుడు, రచయిత తనికెళ్ల భరణి సోనూసూద్‌కి సత్కారం చేశారు. ఆచార్య మూవీ సెట్స్‌లో శాలువా కప్పి సన్మానించారు. ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నటిస్తోన్న అల్లుడు సెట్స్‌లో చిత్రబృందం సోనూసూద్‌ను సన్మానించిన విషయం తెలిసిందే.