Jan 19,2022 12:36

న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్‌ కొనుగోలు సంబంధించిన మొత్తం బకాయిలను ప్రభుత్వానికి రిలయన్స్‌ జియో చెల్లించింది. ఈ మేరకు జియో బుధవారం వెల్లడించింది. మొత్తం రూ. 30, 791 కోట్ల బకాయిలను టెలికాం శాఖకు చెల్లించినట్లు తెలిపింది. 2021కి ముందు జరిగిన స్పెక్ట్రం వేలానికి సంబంధించి వడ్డీతో సహా అన్ని బకాయిలను చెల్లించినట్లేనని పేర్కొంది. 2014, 2015, 2016లో వేలంలో జరిగిన స్పెక్ట్రం కేటాయింపులతో పాటు 2021లో భారతి ఎయిర్‌టెల్‌తోనూ ట్రేడింగ్‌ హక్కుల ద్వారా పొందిన స్పెక్ట్రమ్‌కు సంబంధించిన మొత్తాన్ని టెలికాం శాఖకు కట్టేసింది. ఎయిర్‌ టెల్‌ నుండి కంపెనీ 585.3 ఎంహెచ్‌జెడ్‌ స్పెక్ట్రం సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పుడు చెల్లింపులు చేసింది. అయితే కొన్ని ముందస్తు చెల్లింపులు చేయడంతో.. ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం.. కంపెనీకి రూ. 1200 కోట్లు ఆదా అవుతుందని జియో పేర్కొంది.