Oct 27,2021 19:24

స్పెయిన్‌ షెడ్యూల్‌ పూర్తిసూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, పరశురామ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'సర్కారువారి పాట'. ఈ సినిమా టీమ్‌ ఇటీవల ఓ షెడ్యూల్‌ను స్పెయిన్‌లో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు, ఒక సాంగ్‌ చిత్రీకరించారు. పాట చిత్రీకరణతో ఈ షెడ్యూల్‌ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. శేఖర్‌ మాస్టర్‌, చిత్ర బృందం దిగిన ఒక ఫోటో సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా 14 రీల్స్‌ ప్లస్‌, జీ.మహేశ్‌ బాబు ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు.