May 16,2022 23:30

స్పందనలో అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు.

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ధనుంజరు
ప్రజాశక్తి -రాజవొమ్మంగి :
స్పందనలో వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించి, సత్వరమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ధనుంజరు, ఆదేశించారు. సోమవారం రంపచోడవరం ఐటిడిఎ సమావేశ మందిరంలో సబ్‌ కలెక్టర్‌ కట్టా సింహాచలం, రంపచోడవరం ఐటిడిఎ ఎపిఒ జనరల్‌ పివిఎస్‌ నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.ముక్కంటిలతో కలిసి స్పందన నిర్వహించారు. వివిధ సమస్యలపై 50 అర్జీలను స్వీకరించారు. వై.రామవరం మండలం కోట నుంచి వలస గ్రామం వరకు, అలాగే యార్లగడ్డ నుంచి మఠం భీమవరం వరకు బిటి రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అభ్యంతరాలను పరిష్కరించి పనులు చేపట్టాలని కోరారు. మండలంలో మారుమూల గ్రామాలకు మెటల్‌ రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎంపిపి ఆనంద్‌, జెడ్‌పిటిసి కర్రి వెంకటలక్ష్మి, వైస్‌ ఎంపిపి మూర్ల జోగిరెడ్డి, ఎంపిటిసి భూలక్ష్మి స్పందనలో వినతిపత్రం అందించారు. వద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని,అడ్డతీగల మండలం చిన్న మునకనగడ్డ గ్రామానికి చెందిన నక్క నాగేశ్వరరావు అర్జీ అందించారు. టిటిసిలో ఖాళీపోస్టులో తనను నియమించాలని లచ్చిరెడ్డి, రాజవొమ్మంగి మండలం శరభవరంలో భóూసమస్య పరిష్కరించాలని నేబుల పెద్దబ్బాయి దరఖాస్తులిచ్చారు. ఆర్‌అండ్‌ ఆర్‌ ప్యాకేజీ మంజూరు, పింఛన్లు, ఇతర వ్యక్తిగత సమస్యలపై పలు వినతులువచ్చాయి.
కార్యక్రమంలో ఎస్‌డిసి వెంకటేశ్వరరావు, వెటర్నరీ డిడి రమేష్‌ నాయక్‌, ఎడిఎంహెచ్‌ఒ డాక్టర్‌ అనూష, ఇఇలు జి డేవిడ్‌ రాజు.ఎండి. యూసఫ్‌, సత్యనారాయణ, తహశీల్డార్‌ కె.లక్ష్మి కళ్యాణి, డిప్యూటీ సర్వే ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. దేవేంద్రుడు, ఎస్‌ఒ ఆర్‌ భాస్కరరావు, ఎస్‌ కుమార్‌, ఎపిడి కె.కోటేశ్వరరావు, ఎ.శ్రీనివాసరావు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కల్పన, జిసిసి మేనేజర్‌ యూసఫ్‌, ఎంపిడిఒ మడకం కుమారి. సిడిపిఒ పద్మావతి, ఎఎంఒ శ్రీహరి, డిఇఇలు రాజేంద్రబాబు, వై వెంకటేశ్వర్లు, రామచంద్రరావు, శీనివాసరావు, సాయి సతీష్‌, డివిజినల్‌ పంచాయితీ కార్యాలయ సూపరింటెండెంట్‌ రామకష్ణ పాల్గొన్నారు.