
ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించ డానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సోమవారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను వెంటనే సంబంధిత అధికారులచే వెంటనే విచారణ చేపట్టాలన్నారు. స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అర్ధవంతంగా పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులు తప్పనిసరిగా గురువారం గ్రామాల్లో పర్యటించాలన్నారు. శనివారం గృహ నిర్మాణా లను లేఔట్స్ వారీగా కేటాయించిన అధికారులు జగనన్న లే ఔట్స్ పరిశీలించాలన్నారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు ముఖ ఆధారిత హాజరు యాప్ ద్వారా నూరు శాతం వేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు కలెక్టర్ మునగ మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ శివజ్యోతి, డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ అర్జున్‌రావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ నాయక్, వ్యవసాయ శాఖ జెడి అబ్దుల్ సత్తార్, పశుసంవర్థక శాఖ జెడి హనుమంతరావు, మత్స్య శాఖ జెడి సురేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, పౌర సరఫరాల శాఖ డిఎం శ్రీలక్ష్మి, డిఎస్‌ఓ విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు.