
ప్రజాశక్తి-రేపల్లె: ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి రేపల్లె వేమూరు నియోజకవర్గాల్లోని ప్రజలు సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవాలని ఆర్డిఓ జగన్నాథం పార్థసారథి అన్నారు. రేపల్లెలో ఆర్డీవో కార్యాలయంలో స్పందనతో ప్రజా సమస్యలను పరిష్కరించే గ్రీవెన్స్ నిర్వహణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో 7అర్జీలు కొత్తగా వచ్చాయని, వీటిని ఆయా శాఖ అధికారులకు పరిష్కరించేందుకు పంపడం జరిగిందని ఆర్డీవో తెలిపారు. స్పందనలో వచ్చిన ప్రతి ఫిర్యాదుకు అధికారులు తక్షణమే స్పందించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో పార్థసారథి అధికారులను ఆదేశించారు. రేపల్లె వేమూరు నియోజకవర్గ ప్రజలు స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో కోరారు. ఈ స్పందనలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. అనంతరం డివిజన్ పరిధిలోని వివిధ విభాగాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించి, ప్రజల నుంచి ఫిర్యాదులు అందకుండా, వారి సమస్యలను పరిష్కరిస్తూ, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.