Oct 13,2021 21:20

న్యూఢిల్లీ: భారత యువ మహిళా స్ప్రింటర్‌ హిమాదాస్‌కు కరోనా సోకింది. పాటియాలాలోని జాతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌(ఎన్‌ఐఎస్‌)లో కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె ట్విట్టర్‌ వేదికగా.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేందుకు మాస్క్‌ ధరించాలని సూచించింది. కండరాల నొప్పితో హిమ కొంతకాలం విశ్రాంతి తీసుకొని ఈ నెల 10న పాటియాలా చేరుకుంది. 8, 9న గౌహతిలో ఉన్న సమయంలోనే అలసిపోతున్నట్లు తెలిసిందని, ప్రస్తుతం హిమ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె కోచ్‌ గలీనా బుఖరినా తెలిపారు.