May 15,2022 11:27

ప్రజాశక్తి - పెనుమంట్ర (పశ్చిమ గోదావరి) : 1861 లో కాటన్‌ సర్‌ బిరుదాంకితుడైనాడని మార్టేరు ఇరిగేషన్‌ సెక్షన్‌ ఎఈఈ జి జయశంకర్‌ కొనియాడారు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ దొర 219 వ జన్మదిన వేడుకలు జలవనరుల శాఖ మార్టేరు ఇరిగేషన్‌ సెక్షన్‌ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్‌ మాట్లాడుతూ ... కాటన్‌ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనేవారని అన్నారు. జనరల్‌ సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 1803 సంవత్సరం నుండి 1899 వరకు బ్రిటీషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరుగా కాటన్‌ తన జీవితాన్ని బ్రిటిషు భారత సామ్రాజ్యంలో నీటిపారుదల, నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడని అన్నారు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరిజలాలు అందేలా చేసి చిరస్మరణీయుడయ్యారని అన్నారు. 1819లో మద్రాసు ఇంజినీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.