
శ్రీనగర్: కరోనా కల్లోల్లం సృష్టిస్తోంది. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు. తాజాగా శ్రీనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని 80 మంది వైద్యులు, పారామెడికల్ ఉద్యోగులు, ఎంబిబిఎస్ విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. మంగళవారం ఒక్కరోజే వైద్యకళాశాలలో ఇన్ని కేసులు వెలుగు చూడటం కలవరాన్ని సృష్టిస్తోంది. 46 మంది డాక్టర్లు, 22 మంది ఎంబిబిఎస్ విద్యార్థులు, 15 మంది పారామెడికల్ ఉద్యోగులకు కరోనా సోకిందని కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సలీంఖాన్ చెప్పారు. ఇక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 546కు పెరిగాయి. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని వైద్యులు సూచించారు. మంగళవారం ఒక్కరోజే జమ్ములో 3,105, కాశ్మీరులో 1546 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 21,677కు పెరిగింది. ఒక్క రోజులో కరోనాతో ముగ్గురు మరణించారు.