Oct 14,2021 22:02

శరీర దారుఢ్యానికి వ్యాయామం అవసరం

ప్రజాశక్తి -కలకడ : శరీర దారుఢ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని ఎస్‌ఐ రవి ప్రకాష్‌ రెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన కలకడ పోలీస్‌ స్టేషన్‌కు సమీప పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ నందు గురువారం ఉదయం పోలీసు సిబ్బందికి పరేడ్‌ నిర్వహించి పలు రకాలైన వ్యాయామాలను చేయించడం జరిగిందన్నారు. దీనివలన శరీర ధారుఢ్యం కలిగి ఉండటమే కాకుండా, మనసు నిర్మలంగా ఉండి ఉల్లాసంగా ఉండేందుకు వ్యాయామాలు ఎంతో ఉపయోగపడతాయని సిబ్బందికి సూచించారు. హెడ్‌ కానిస్టేబుల్‌ సునీల్‌ శశి కుమార్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.